Earthquake Delhi, Uttarakhand : నేపాల్‌లో భారీ భూపంకం ప్రభావంతో.. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు

నేపాల్‌లో భారీ భూకంపం ప్రభావంతో భారత్ లోని ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్‌, గురుగ్రామ్‌, ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake Delhi, Uttarakhand : నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో భారత్ లోని ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని ఘజియాబాద్‌, గురుగ్రామ్‌, ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో మరోసారి భూమి కంపించింది. బుధవారం ఉదయం 6.27 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, గత పదేళ్లలో ఉత్తరాఖండ్‌లో ఏడు వందల సార్లు భూకంపాలు సంభవించాయని నిపుణులు వెల్లడించారు.

Earthquake In Nepal : నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు దుర్మరణం

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ వెల్లడించింది. దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు