జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ 

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి.

  • Publish Date - January 26, 2019 / 02:16 AM IST

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి.

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లో తరచుగా ఎన్ కౌంటర్ లు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఉగ్రవాదులు.. భారత భద్రతా దళాలపై కాల్పులు జరుపుతున్నారు. మరో్వైపు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తూ కాల్పులకు పాల్పడుతుంది. తాజాగా జనవరి 26న శ్రీనగర్ ఖోన్మోహ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు, భద్రతా దళాల కాల్పులతో ఖోన్మోహ ప్రాంతం మారోమోగుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.