Fake Notes Deposit Mission : ఏలూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో ఫేక్ నోట్లు జమ చేసిన వ్యక్తి

ఏలూరు జిల్లా నర్సాపురంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో 40 ఐదు వందల దొంగ నోట్లను ఓ వ్యక్తి డిపాజిట్ చేశారు. బ్యాక్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Fake Notes Deposit Mission : ఏలూరు జిల్లా నర్సాపురంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ మిషన్ లో 40 ఐదు వందల దొంగ నోట్లను ఓ వ్యక్తి డిపాజిట్ చేశారు. బ్యాక్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగ నోట్లను డిపాజిట్ చేశారన్న ఆరోపణలతో స్థానిక వీఆర్వో పెద్దిరాజుతోపాటు అతని కుమారున్ని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. దొంగ నోట్లు ఎవరు ఇచ్చారన్న దానిపై విచారణ జరుపుతున్నారు.

స్థానిక వీఆర్వో పెద్దిరాజు, ఆయన కుమారుడు రాత్రి ఏటీఎమ్ మిషన్ లో దొంగ నోట్లను డిపాజిట్ చేస్తున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉదయం బ్యాంక్ సిబ్బంది వెళ్లి ఏటీఎమ్ ను ఓపెన్ చేసి చూడగా నకిలీ 500 నోట్లు ఒక్క పక్కన ఉండటాన్ని గుర్తించారు. వాటిని దొంగ నోట్లుగా గుర్తించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

Fake Notes : జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల కలకలం..15 లక్షల దొంగ నోట్లు, 3 లక్షల అసలు నోట్లు స్వాధీనం

అయితే నర్సాపురం కేంద్రంగా ఈ దొంగ నోట్లు పెద్ద ఎత్తున చెలామణి అవుతున్నాయన్న సందర్భంగా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. వీఆర్వో ఇచ్చిన సమాచారంతో అతనికి దొంగ నోట్లు ఇచ్చిన వారిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ దొంగ నోట్లన్ని ఎవరికి చేరాయి? దీనికి ప్రధాన సూత్రధారి ఎవరనేదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు