Fake Notes : జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల కలకలం..15 లక్షల దొంగ నోట్లు, 3 లక్షల అసలు నోట్లు స్వాధీనం

దొంగ నోట్లను మార్చేందుకు వారు వచ్చారని నిర్ధారించిన పోలీసులు...వారి దగ్గరి నుంచి 15 లక్షల దొంగనోట్లు, 3 లక్షల అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Fake Notes : జగిత్యాల జిల్లాలో దొంగ నోట్ల కలకలం..15 లక్షల దొంగ నోట్లు, 3 లక్షల అసలు నోట్లు స్వాధీనం

Fake Notes

fake notes seized : జగిత్యాల పట్టణంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. దొంగ నోట్ల ముఠా వచ్చిందనే సమాచారం అందుకున్న పోలీసులు… కొత్త బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన అయిదుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా అసలు విషయం బయట పడింది. దొంగ నోట్లను మార్చేందుకు వారు వచ్చారని నిర్ధారించిన పోలీసులు…వారి దగ్గరి నుంచి 15 లక్షల దొంగనోట్లు, 3 లక్షల అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Fake Currency Notes : షాకింగ్.. దేశంలో పెరిగిన దొంగ నోట్లు.. రూ.500 నోట్లే ఎక్కువ

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాల్లపెట్ గ్రామానికి చెందిన మేక శేఖర్, జన్నారం మండలం పుట్టిగూడకు చెందిన రాధాకిషన్, గోదావరిఖనిలో ఉండే సిద్దిపేట జిల్లాకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్, హనుమకొండకు చెందిన విజ్జగిరి శ్రీకాంత్, విజ్జగిరి బిక్షపతి అనే ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్‌ నుంచి తెచ్చిన దొంగనోట్లను మార్చేందుకు జగిత్యాలకు వచ్చారని పోలీసులు వెల్లడించారు. వారిలో మేక శేఖర్‌ దొంగ నోట్ల చలామణిలో పాత నిందితుడని, గతంలో అతనిపై ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.