family commit suicide for unable bear death son : ఇంటికి పెద్ద కుమారుడు క్యాన్సర్ తో మరణించటంఆ కుటుంబాన్ని కలిచివేసింది పోయిన కుమారుడ్ని తలుచుకుంటూనే రోజులు గడిపారు. అతని స్మృతుల్లోంచి బయటకు రాలేక కుటంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నఘటన తమిళనాడులోని సేలంజిల్లాలో జరిగింది.
జిల్లాలోని అమ్మాపేట సమీపంలోని వలకాడుకు చెందిన మురుగన్, కోకిల దంపతులకు మదన్ కుమార్(14)వసంత కుమార్(12) కార్తీక్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మురుగన్ సమీప గ్రామంలోని సెలూన్ లో పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం మురుగన్ ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కొంత పొద్దుపోయిన తర్వాత పక్కింటి వాళ్లకి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగల గొట్టిచూడగా కుటుంబ సభ్యులు అందరూ విగతజీవులై పడి ఉన్నారు. మృతదేహాలను పరీక్షించగా విషం సేవించినట్లు బయటపడింది. పోస్టుమార్టం కోసం శవాలను ఆస్పత్రికి తరలించారు.
సేలం అమ్మాపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో … మురుగున్ పెద్దకుమారుడైన మదన్ కుమార్ 8నెలల క్రితం క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి మురుగన్, కోకిల మదన్ కుమార్ ఫోటో ముందే కూర్చుని బాధపడుతూ ఉండేవారు. స్ధానికులతో కూడా మాట్లాడటం తగ్గించేశారు. మరో వైపు కరోనా లాక్ డౌన్. కొడుకు పోయాడనే బాధతో మురుగన్ సెలూన్ కు వెళ్లటం మానేశాడు. కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. ఈ పరిస్ధితుల్లో ఇద్దరు కుమారులకు విషమిచ్చి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది.