Medak Court Incident: మెదక్‌లో తీవ్ర విషాదం.. కోర్టు భవనంపై నుంచి దూకేసిన కుటుంబం.. భార్య మృతి.. భర్త పిల్లల పరిస్థితి విషమం..

ఈ క్రమంలో దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు బిల్డింగ్ పైనుంచి దూకేశారు.

Medak Court Incident: మెదక్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి కోర్టు బిల్డింగ్ పై నుండి దూకేశారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న భర్త, పిల్లలను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య, దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత ఏడాది నవీన్ అత్త ఇంటిపై సుతిల్ బాంబు వేశాడు. రామాయంపేట పోలీస్ స్టేషన్ లో నవీన్ పై కేసు నమోదైంది. ఆ కేసులో అతడు 2 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. అప్పటి నుంచి భార్య భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.

Also Read: యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం.. ఆ ఆరోపణలను ఖండించిన పూర్ణచందర్.. మీడియాకు లేఖ

అత్తింటి పై బాంబు వేసిన కేసు ఇవాళ(జూన్ 28) హియరింగ్ రావడంతో దంపతులు కోర్టుకి వచ్చారు. అయితే కోర్టు ప్రాంగణంలోనే గొడవపడ్డారు భార్యభర్తలు. ఈ క్రమంలో దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు బిల్డింగ్ పైనుంచి దూకేశారు. భార్య స్పాట్ లోనే మరణించింది. భర్త, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. నవీన్, రమ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పేరు రుత్విక. చిన్నమ్మాయి పేరు యశ్విక.