Family Suicide Attempt Secunderabad
Family Suicide Attempt : సికింద్రాబాద్ బోయినపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
ఇద్దరు కుమార్తెలు,కొడుకుతో సహా భార్యా భర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా వీరిలో భార్య స్నేహ బాటియా (40) పెద్ద కుమార్తె హన్సిక(15) మరణించగా.. భర్త విజయ్ బాటియా, చిన్నకుమార్తె వంశిక పరిస్ధితి విషమంగా ఉంది. ఆర్ధిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కూతురు వంశిక, కొడుకు కలిసి బంధువులకు సమాచారం ఇవ్వటంతో వారు వెంటనే సంఘటనా స్ధలానికి వచ్చారు. భర్త విజయ్, కూతురు వంశికలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం రాజస్ధాన్ లోని నోహార్ కు చెందని వారని తెలుస్తోంది.