Cruel Father : కరోనాతో భార్య మృతి…మరదలిపై కన్నేసిన బావ…
కోవిడ్ -19 కారణంగా ఐదునెలల క్రితం భార్య చనిపోయింది. నలుగురు పిల్లల్ని పెంచేందుకు తన మరదల్ని ఇచ్చి వివాహం చేయాలని అత్తమామలను కోరాడు ఓ వ్యక్తి.
- chvmurthy
- Published On : September 19, 2021 / 12:19 PM IST
Rajasthan Father
Father killed 4 daughters : కోవిడ్ -19 కారణంగా ఐదునెలల క్రితం భార్య చనిపోయింది. నలుగురు పిల్లల్ని పెంచేందుకు తన మరదల్ని ఇచ్చి వివాహం చేయాలని అత్తమామలను కోరాడు ఓ వ్యక్తి. అందుకు యువతి తల్లి తండ్రులు అంగీకరించక పోవటంతో పిల్లలను చంపి, తాను ఆత్యహత్యయత్నం చేసుకున్న ఘటన రాజస్ధాన్ లో చోటు చేసుకుంది.
రాజస్ధాన్ లోని బార్మర్ జిల్లా, పోషాలా గ్రామంలో నివసించే పూర్ఖారామ్ కు భార్యా, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఐదు నెలల క్రితం కోవిడ్ సోకి మరణించింది. అప్పటి నుంచి నలుగురు పిల్లలను పూర్ఖారామ్ పెంచసాగాడు. 9 ఏళ్లలోపు నలుగురు ఆడ పిల్లలను పెంచేందుకు, పిల్లలకు తల్లి అవసరం కూడా తీరుతుందని భావించి… మరదలినిచ్చి పెళ్లి చేయమని తన అత్తమాలను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు.
దీంతోమనస్తాపానికి గురైన పుర్ఖారామ్ తన నలుగురు పిల్లలు జియో(9) నోజి(7) హీనా(3) లాసి( ఏడాదిన్నర)లకు విషమిచ్చి వారిని ఇంటిముందు ఉన్న 13 అడుగుల నీటి తొట్టిలో పడేశాడు. అనంతరం తాను ఆ నీటి తోట్టి లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్ఖారామ్ నీటి తోట్టిలో దూకటం చూసిన స్ధానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు ఐదుగురిని బయటకు తీశారు. విషం సేవించిన నలుగురు చిన్నపిల్లలు మృతి చెందగా… పుర్ఖారామ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
