తండ్రేనా : కూల్ డ్రింక్ లో విషం కలిపి పిల్లలకు ఇచ్చాడు

మేడ్చల్‌ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్‌డ్రింక్‌

  • Publish Date - October 12, 2019 / 10:45 AM IST

మేడ్చల్‌ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్‌డ్రింక్‌

మేడ్చల్‌ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్‌ డ్రింక్‌లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్‌డ్రింక్‌ తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటనలో ప్రణీత్‌ అనే ఐదేళ్ల అబ్బాయి మృతి చెందగా… మరో ఏడేళ్ల బాలుడు ప్రణయ్‌తో పాటు తండ్రి సురేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి అంటే పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేవాడు. పిల్లలకు చిన్న బాధ కలిగినా తల్లిదండ్రులు తట్టుకోలేరు. విలవిలలాడిపోతారు. పిల్లలకు ఏ కష్టం రాకుండా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. కానీ సురేశ్ మాత్రం తండ్రిలా వ్యవహరించలేదు. మద్యం మత్తులో మృగంలా ప్రవర్తించాడు. పిల్లలు అని కూడా చంపేయాలని చూశాడు. ఈ ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. పిల్లలు ఏం పాపం చేశారని కంటతడి పెట్టారు. ఆ తాగుబోతు తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.