మనిషేనా : రెండేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం

  • Publish Date - April 16, 2019 / 10:13 AM IST

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలనే తండ్రే కాటేశాడు. రెండేళ్లుగా కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు. డైరీ ఫామ్ దగ్గర నివాసం ఉండే వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు.
Read Also : తిరుమలకు నీటి గండం : సమ్మర్ ఎఫెక్ట్

తండ్రి పైశాచికత్వాన్ని పినతల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. రోజురోజుకి తండ్రి ఆగడాలు మితిమీరిపోవడంతో బాధితురాలు తట్టుకోలేకపోయింది. స్నేహితులకు చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది. వారి సహకారంతో తండ్రి వెంకటేశ్వర్లుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నీచుడిని కటకటాల్లోకి నెట్టారు. యువతిని చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ సెల్ కి తరలించారు.

కన్న తండ్రే కసాయిలా వ్యవహరించడం స్థానికులను షాక్ కు గురి చేసింది. ఆ తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తండ్రితో పాటు పినతల్లిని కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసి కూడా ఆమె మౌనంగా ఉందని, ఈ పాపంలో ఆమెకు కూడా భాగం ఉందని మండిపడ్డారు. 
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్