Wife Illegal Relationship: భార్యపై అనుమానంతో ఆరేళ్ల కొడుకును చంపిన తండ్రి..
తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగిఉందనే అనుమానంతో ఆరేళ్ల కొడుకును ఓ తండ్రి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
- Harishth Thanniru
- Published On : January 7, 2023 / 03:15 PM IST
Murder Case
Wife Illegal Relationship: తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగిఉందనే అనుమానంతో ఆరేళ్ల కొడుకును తండ్రి హత్యచేసిన విషాధ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లా చందౌసి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడిని అదుపులోకి తీసుకొని బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సంజాని గ్రామానికి చెందిన ధర్మేష్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి ప్రతీరోజూ గొడవ పడుతుండేవాడు. వీరికి ఆరేళ్ల కుమారుడు రజత్ ఉన్నాడు. ధర్మేష్ భార్యపై అనుమానంతో రజత్ తనకు పుట్టిన కొడుకు కాదని భావించాడు. దీంతో కొడుకును హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇంటి బయట రజత్ ఆడుకుతున్న క్రమంలో పొలానికి తీసుకెళ్లాడు. అక్కడే ఎవరూ చూడకుండా షూ లేస్‌తో గొంతుకొసి హత్యచేశాడు. మృతదేహాన్ని పొలంలోనే పడేసి ఇంటికి తిరిగొచ్చాడు. ఈలోపు తన కుమారుడు కనిపించడం లేదని ధర్మేష్ భార్య వెతకడం ప్రారంభించింది. అయినా ఆచూకీ లభించక పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ టీవీ పుటేజిని చూసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం గ్రామంలోని చెరుకుతోట నుంచి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ధర్మేష్‌ను పట్టుకొని అసలు విషయం ఆరాతీయగా.. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకోవటంతో రజత్ తనకు పుట్టినవాడు కాదనే అనుమానంతో హత్య చేసినట్లు తెలిపారు.
