Husband Gives HIV Injection To Wife : దారుణం.. బలానికి మందులు అంటూ, భార్యకు HIV ఇంజెక్షన్ వేయించిన భర్త..!
ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్ తో బతకడం ఎలా అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది.

Husband Gives HIV Injection To Wife : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. ఇంతలోనే భర్త మరో యువతి మోజులో పడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దూరం పెట్టాడు. అదనపు కట్నం తేవాలని తరుచూ వేధించేవాడు. ఆ తర్వాత మరో స్కెచ్ వేశాడు.
ఆర్ఎంపీ డాక్టర్ సాయంతో బలానికి మందులు అని HIV ఇంజెక్షన్ వేయించాడని భార్య ఆరోపిస్తోంది. ఎయిడ్స్ పాజిటివ్ తో బతకడం ఎలా అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో భర్త చరణ్ ను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణం సంచలనంగా మారింది.
పెళ్లైన తర్వాత కొన్నాళ్లు తన భర్త తనతో బాగానే ఉన్నాడని, తనను బాగానే చూసుకున్నాడని బాధితురాలు చెప్పింది. అయితే, మరో యువతితో తన భర్తకు వివాహేతర బంధం ఏర్పడిందని, అప్పటి నుంచి తనను దూరం పెట్టాడని వాపోయింది. ఈ క్రమంలో తనను దూరం చేసేందుకు తన భర్త పథకం వేశాడంది. పిల్లలు పుట్టాలన్నా, బలంగా ఉండాలన్నా తనుకు ఇంజెక్షన్ ఇవ్వాలని తన భర్త తనను మభ్యపెట్టాడని బాధితురాలు చెప్పింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ క్రమంలో భర్త మాటలను నమ్మి ఇంజెక్షన్ వేయించుకున్నానని చెప్పింది. అయితే, పిల్లల కోసం టెస్టింగ్ చేయించుకోగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై భర్త చరణ్ ను నిలదీయగా.. ప్రెగ్నెన్సీ సమయంలో అంగన్ వాడీలో ఆమెకు వ్యాక్సిన్ వేశారని, దాని వల్లే హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని అతడు బుకాయించాడు.
పలు దఫాలుగా తనకు హెచ్ఐవీ ఇంజెక్షన్లు వేయించాడని తన భర్తపై బాధితురాలు ఆరోపణలు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. భర్త చరణ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో మహిళ మోజులో పడిన భర్త.. ప్రేమించి పెళ్లాడిన భార్యను వదిలించుకునేందుకు హెచ్ఐవీ ఇంజెక్షన్లు వేయించాడనే వార్త స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.