ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

  • Publish Date - December 22, 2019 / 03:31 PM IST

ముంబై మహానగరంలో  ఆదివారం డిసెంబర్ 22వ తేదీ రాత్రి  భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి గం.7.10ని.ల సమయంలో విల్లే పార్లే ప్రాంతంలోని 13 అంతస్తుల భవనంలోని 7,8 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  సమాచారం  తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్ధలానికి  చేరుకున్నారు.  

భవనంలో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  భవనంలోంచి నలుగురిని  రక్షించి బయటకు తీసుకువచ్చారు. మంటలు ఆర్పేందుకు 10 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు మరో బృందం ప్రయత్నిస్తోంది.  అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.