five died: చేప వ్యర్థాల ట్యాంకులో దిగి.. ఊపిరాడక ఐదుగురు మృతి
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని చేప వ్యర్థాలను కలెక్ట్ చేసే ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఐదుగురు ఊపిరాడక మరణించారు.
- Narender Thiru
- Published On : April 18, 2022 / 05:15 PM IST
Fish
Mangaluru: కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని చేప వ్యర్థాలను కలెక్ట్ చేసే ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఐదుగురు ఊపిరాడక మరణించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరులోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో శ్రీ ఉల్కా ఎల్ఎల్‌పీ అనే ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఇందులో పనిచేసే కార్మికుల్లో ఒక కార్మికుడు పొరపాటున చేప వ్యర్థాలను సేకరించే ట్యాంకులో పడి, స్పృహ తప్పిపోయాడు. దీంతో అతడిని రక్షించేందుకు మరో ఏడుగురు కార్మికులు ట్యాంకులో దిగారు. వెంటనే వాళ్లు కూడా స్పృహతప్పి పడిపోయారు.
Cyber crime : కలెక్టర్ పేరిట నకిలీ వాట్సప్ ఖాతా.. రూ. 2.40లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు
చేప వ్యర్థాల ట్యాంకులో విష వాయువులు వెలువడటం వల్ల, ఆక్సిజన్ లభించకపోవడంతో కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే గుర్తించిన ఇతర సిబ్బంది, ఎనిమిది మందిని బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఐదుగురు మరణించారు. మిగిలిన ముగ్గురికి ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం వాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మృతులంతా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. వారి వయస్సు 20-22 ఏళ్లలోపే అని పోలీసులు చెప్పారు. కాగా, కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
