వరంగల్ జిలాల్లో తొమ్మిది నెలల్లో ఐదుగురు అమ్మాయిలు హత్య గావించబడ్డారు. ప్రేమోన్మాదుల ఘాతుకానికి అమ్మాయిలు బలయ్యారు.
వరంగల్ జిలాల్లో తొమ్మిది నెలల్లో ఐదుగురు అమ్మాయిలు హత్య గావించబడ్డారు. ప్రేమోన్మాదుల ఘాతుకానికి అమ్మాయిలు బలయ్యారు. ప్రేమోన్మాదుల అఘాయిత్యాలతో వరంగల్ అమ్మాయిలు వణికిపోతున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ లోదారుణం జరిగింది. రామ్ నగర్ లో హారతి అనే యువతి గొంతుకోసి చంపాడు ఓ ఉన్మాది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ యువతి మృతి చెందింది. రాంనగర్ లో షాహిద్ అనే యువకుడు హారతి అనే యువతిని గొంతుకోసి చంపాడు.
వరంగల్‌లో నిన్న ప్రేమోన్మాది చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన హారతి మృతదేహానికి కాసేపట్లో పోస్ట్‌మార్టమ్ జరగనుంది. ప్రస్తుతం హారతి మృతదేహం వరంగల్ MGM ఆసుపత్రిలో ఉంది. కాజీపేటకు చెందిన షాహిద్.. నిన్న హరతిని హత్య చేశాడు. ప్రేమ వ్యవహారంలో జరిగిన ఘర్షణే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు జడ్జి ఎదుట లొంగిపోయాడు.
హన్మకొండలోని రాంనగర్‌కు చెందిన హారతి, షాహిద్ మధ్య కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. అయితే.. నిన్న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో షాహిద్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై హారతి చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఘటన అనంతరం నిందితుడు షాహిద్.. జడ్జి ముందు లొంగిపోయాడు.
వరంగల్ అమ్మాయిలు ప్రేమోన్మాదుల దెబ్బకు వణికిపోతున్నారు. 9నెలల కాలంలో నలుగురు అమ్మాయిలు ప్రేమవ్యవహారానికి బలైపోయారు. మహిళలు పై అకృత్యాలు చేసేవారిని శిక్షించేందుకు ఎన్ని చట్టాలు చేస్తున్నా మహిళలు, యువతులపై మృగాళ్ల అకృత్యాలు ఆగటం లేదు. ఇటీవలే జరిగిన మానస ఘటన మరువక ముందే ఈ ఘటన జరగటంతో స్ధానికులు షాక్ అయ్యారు.