Prakasam District : చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు.
- chvmurthy
- Published On : June 11, 2022 / 09:32 PM IST
prakasam District
Prakasam District : ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. జరుగుమల్లి మండలం అక్కచెరువుపాలెంలో దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్ధినీ, విద్యార్ధులు ఈ రోజుసాయంత్రం చెరువులో ఈతకు వెళ్లారు. వారు ఆరుగురు ఈతరాక నీట మునిగిపోతుండటంతో గట్టిగా కేకలు వేశారు.
అటుగా వెళుతన్న ఒకవ్యక్తి వెంటనే చెరువులోకి దిగి ముందు ఇద్దరు విద్యార్ధినులను బయటకు తీశాడు. మిగిలిన నలుగురు విద్యార్ధులను బయటకు తీసే క్రమంలో వారు నీట మునిగి చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
ఈతగాళ్లను చెరువులోకి దింపి నలుగురు విద్యార్ధుల మృతదేహాలు వెలికి తీశారు. చెరువులోంచి బయటపడిన ఇద్దరు విద్యార్ధినులను చికిత్స నిమిత్తం కందూకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన నలుగురు విద్యార్ధులు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read : Prathyusha Garimella : ఇది నేను కోరుకున్న జీవితం కాదు.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్
