Prathyusha Garimella : ఇది నేను కోరుకున్న జీవితం కాదు.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష సూసైడ్ నోట్
పోలీసులు ప్రత్యూష సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదు. తల్లిదండ్రులకు భారంగా ఉండలేను అని సూసైడ్ నోట్ లో ఉంది.
Prathyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపుతోంది. పోలీసులు ప్రత్యూష సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని, తల్లిదండ్రులకు భారంగా ఉండలేనని అందులో ఉంది. ప్రత్యుష గరిమెళ్ల రిటైర్డ్ ఐఆర్ఎస్ కృష్ణారావు కూతురు. ఇండియాలో టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ప్రత్యూష ఎదిగింది. టాలీవుడ్, బాలీవుడ్ తారలకు ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించిన ఆమె.. దక్షిణాదిలో దాదాపు అందరు హీరోయిన్లకు డ్రెస్ లు డిజైన్ చేసింది.
”ప్రత్యూష గరిమెళ్ల నిన్న రాత్రి జూబ్లీహిల్స్ లోని సొంత ఇంటి నుండి బోటిక్ కు వచ్చింది. బోటిక్ కు రాగానే ఓ బ్యాగ్ తో లోపలికి వెళ్లింది. తనను డిస్ట్రబ్ చేయొద్దని ఆమె వాచ్ మెన్ కు చెప్పింది” అని పోలీసులు తెలిపారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో సత్తా చాటుతున్న ప్రత్యూష గరిమెళ్ల హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. డిప్రెషన్‌కు గురైన నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఆత్మహత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు కనుగొన్నారు. తన ఇంటిలోని బాత్ రూమ్‌లో ప్రత్యూష విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Pratyusha Garimella : ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద మృతి
”నేను స్వేచ్ఛను కోరుకున్నా. ఎవరికీ భారం కాదల్చుకోలేదు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అనేక సార్లు యత్నించా. ప్రతి రోజు బాధపడుతూనే ఉన్నా” అని ప్రత్యూష సూసైడ్ నోట్ లో ఉంది.