Cheating : తక్కువ ధరకు బంగారం…మాజీ మంత్రి అల్లుడితో సహా…రూ.6.5 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు

......ఎంత బంగారం ఉన్నా ఇంకా కొనాలనే అనుకుంటారు. ఆదే ఆశ ఇప్పుడు మాజీ మంత్రి అల్లుడ్ని అతని స్నేహితులను ఆరున్నర కోట్ల రూపాయలుకు మోసపోయేలా చేసింది.

Cheating : బంగారం ఈ పేరు చెప్పగానే ఎంత పెద్ద కోటీశ్వరులైనా దానిపై ఆసక్తి చూపిస్తారు. వాళ్ల దగ్గర ఎంత బంగారం ఉన్నా ఇంకా కొనాలనే అనుకుంటారు. ఆదే ఆశ ఇప్పుడు మాజీ మంత్రి అల్లుడ్ని అతని స్నేహితులను ఆరున్నర కోట్ల రూపాయలకు మోసపోయేలా చేసింది.

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన మాజీ మంత్రి పన్నీర్ సెల్వం అల్లుడు ప్రవీణ్ అలెగ్జాండర్, అతని స్నేహితులు గౌతమ్, గణేష్ కుమార్‌లకు ఇటీవల చెన్నై పులియాంతోపుకి చెందిన బాలాజీ పరిచయం అయ్యాడు. దినేష్ అనే వ్యక్తి బాలాజీని ఈ ముగ్గురికి పరిచయం చేశాడు.

అనంతరం బాలాజీ తండ్రి తులసీదాస్, మాధవరం‌కు చెందిన జయకృష్ణన్, మహేష్ అనే వ్యక్తులు కూడా పరిచయం అయ్యారు. వీరిలో తులసీదాస్ అనే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నాడని…. ఆయనకున్న పరిచయాలతో కస్టమ్స్ అధికారుల సహకారంతో బిల్లులు లేకుండా సెల్ ఫోన్లు, బంగారం, వెండి, కార్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నట్లు బాలాజీ,  అలెగ్జాండర్ అతని స్నేహితులకు చెప్పాడు.
Also Read : Road Accident : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అతని మాటలు నమ్మిన అలెగ్జాండర్, అతని స్నేహితులు మొదట ఆరు లక్షలకు బంగారం కొనుగోలు చేశారు. మాట ప్రకారం బాలాజీ ఆరు లక్షలకు బంగారం ఇచ్చాడు. అనంతరం రూ.6.5 కోట్లకు బంగారం కొనాలని నిర్ణయించుకుని, నగదు మొత్తాన్ని బాలాజీ అతడి మిత్రుడు దినేష్‌కు అందచేశారు.

రూ.6.5  కోట్లు తీసుకున్న తర్వాత నుంచి దినేష్, బాలాజీ కనిపించకుండా పోయారు. దీంతో అలెగ్జాండర్ అతని స్నేహితులు కీల్పాక్ డిప్యూటీ కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలాజీతో సహా నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు