Kamareddy : సభ్య సమాజం తలదించుకొనే ఘటన. అమ్మతనానికే మాయని మచ్చ. కన్న కూతుళ్లను బలవంతంగా..యువకుల వద్దకు పంపించేది. వక్రబుద్ధితో కూతుళ్ల జీవితాలను నాశనం చేసేసింది. అందులో ఒకరు మైనర్ కావడం ఇప్పుడా జిల్లాలో కలకలం రేపుతోంది. యువకుల్లో ఒకరు కానిస్టేబుల్ కావడం గమనార్హం. దీనిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
నిజామాబాద్ (NZB) జిల్లా కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఇందులో ఒకరు మైనర్. బతుకు దెరువు కోసం ఆమె భర్త విదేశాల్లో పని చేసే వారు. పెద్ద కూతురిని మెదక్ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ తో పాటు మరొక యువకుడి వద్దకు తరచూ పంపించేది.
కొన్ని రోజుల తర్వాత..వారి బారిన పడకుండా..ఆమె తప్పించుకొనేది. ఈ క్రమంలో..ఆ కామాంధుల కన్ను..మైనర్ కూతురిపై పడింది. వారు ఏది చెబితే తల్లి ఆ విధంగా చేసేది. అసలు తనను ఎందుకు అక్కడకు పంపిస్తుందో..ఏమి చేస్తున్నారో ఆ మైనర్ బాలికకు తెలియదు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా సాగించేది. అయితే..బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లిన తండ్రి ఇంటికి వచ్చాడు.
తల్లి ఏ విధంగా చేయిస్తుందో చెప్పారు కూతుళ్లు. బాధిత బాలిక, తండ్రి ఇద్దరూ కలిసి జిల్లా ఎస్పీ శ్వేతను కలిశారు. జరిగిదంతా..చెప్పారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు. తల్లితో పాటు నిందితులైన కానిస్టేబుల్, మరో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.