Karnataka Girl: కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుండగా క్రేన్ ఢీకొని యువతి మృతి.. వీడియోలో రికార్డైన ఘటన
కాలేజీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న యువతిని క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక, బెంగళూరులో శుక్రవారం జరిగింది.
- Narender Thiru
- Published On : November 5, 2022 / 04:43 PM IST
Karnataka Girl: కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఒక యువతిని క్రేన్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆస్పత్రిలో మరణించింది. ఈ ఘటన బెంగళూరు, వైట్‌ఫీల్డ్ ఏరియాలో శుక్రవారం జరిగింది.
Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు
నూర్ పిజా అనే యువతి శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ కాలేజీ నుంచి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక క్రేన్ ఆ యువతిని ఢీకొంది. క్రేన్ టైర్లు ఆమె పై నుంచి వెళ్లాయి. ఈ ఘటనలో నూర్ పిజా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలు కావడం వల్ల చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన బాధిత యువతి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్‌పేట వాసులే!
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో కాలేజీలు ఉన్నప్పటికీ, కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా లేవని స్థానికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
लड़की को कुचलते हुए निकल गई क्रेन, देंखे ये हैरान कर देने वाला VIDEO pic.twitter.com/mhC2V8pnot
— News Track (@newstracklive) November 5, 2022
