హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలికపై రేప్ కేసులో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్ ప్రాంతంలో బాలికపై అత్యాచారం జరిపి బ్లేడ్ తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఈ కేసులో పోలీసులు ఆసక్తికర వివరాలు తెలిపారు. తన కూతరు అదృశ్యమైందని బాలకృష్ణ అనే వ్యక్తి మార్చి 8న తమకు ఫిర్యాదు చేశాడని చిక్కడపల్లి పోలీసులు చెప్పారు. అదే రోజున బాలిక పీఎస్ కు వచ్చిందని, వివరాలు ఆరా తీసి భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి 3 నెలలుగా అత్యాచారం జరిపాడని పోలీసులు వివరించారు. 3 నెలలుగా బాలిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోందన్నారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందన్నారు. అయితే వేరే యువకుడితో మాట్లాడుతోందనే కోపంతో బాలికపై బ్లేడ్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని చెప్పారు. చిత్రహింసలకు గురి చేసిన బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. గంజాయి ముఠాలో నాను అలియాస్ నరేష్ నాగరాజు, బాబా అలియాస్ అభిరామ్ కీలక నిందితులుగా పోలీసులు గుర్తించారు.
అత్యాచారం వీడియోని మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వారిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. బాలుడిపై ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.