Rajasthan
Girl student finds urine mixed water bottle : ఒకప్పుడు స్కూల్ పిల్లలు ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవనే చెప్పాలి. ఎందుకంటే రాజస్తాన్‌లోని ఓ స్కూల్లో మగ విద్యార్ధులుచేసిన పని వింటే వీళ్లు పిల్లు కాదు పోకిరీగాళ్లు అనేలా ఉంది. తోటి విద్యార్ధిని నానా రకాలుగా ఏడిపించటమేకాకుండా..ఆమె తాగే వాటర్ బాటిల్లో మూత్రం పోశారు. అది తెలియని సదరు విద్యార్థిని ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రావటంతో తనను ఏడిపించే అబ్బాయిలే ఇలా చేసి ఉంటారని హెడ్ మాస్టారుకు ఫిర్యాదు చేసింది. కానీ పిలిచి విషయం తెలుసుకుని మందలించాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు కూడా పట్టించుకోకపోవటంతో పాపం ఆ బాలికకు ఏం చేయాలోతెలియలేదు.
భిల్వారా జిల్లా లుహారియా గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో జరిగిన ఈ ఘటన చదువుకునే పిల్లలు ఈ వయస్సులోనే ఇలాంటి పోకిరి పనులు చేస్తే వారు ఇక భవిష్యత్తులో ఇంకెలా మారతారో అనే ఆందోళన కలుగుతోంది. గత శుక్రవారం (జులై,2023) తోటి విద్యార్థిని మంచినీళ్ల బాటిల్‌లో మూత్రం పోశారు.
ఇది తెలియని బాలిక ఆ నీళ్లు తాగింది. దుర్వాసన రాగా ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది. తన పుస్తకాల బ్యాగులో ప్రేమ లేఖ కూడా పెట్టారని తెలిపింది. కానీ ఆయన అదేమీ పట్టించుకోలేదు. దీంతో పాపం ఆబాలిక ఏడుస్తు ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు ఆగ్రహంగా స్కూల్ కొచ్చి ప్రధానోపాధ్యాయుడ్ని ప్రశ్నించినా అదే నిర్లక్ష్యం. దీంతో వారు తహశీల్దారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామస్తులు ప్రధానోపాధ్యాయుడు ఇంటికి వెళ్లి తాళం వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనటంలో పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తామని విద్యార్ధులను పిలిచి విచారిస్తామని ఏఎస్పీ ఘనశ్యామ్ శర్మ వెల్లడించారు.
Communal Violence : హర్యానాలో మత హింస..ముగ్గురి మృతి