Gujarat: దంపతుల మధ్య గొడవ.. చిన్నారితో సహా 12వ అంతస్థు నుంచి దూకి జంట ఆత్మహత్య
వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జంటలు క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. గొడవల కారణంగా గుజరాత్‌లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ చిన్నారితో కలిసి 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
- Narender Thiru
- Published On : September 7, 2022 / 02:37 PM IST
Gujarat: దంపతుల మధ్య ఉన్న గొడవలు వాళ్ల ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఒక జంట గొడవల కారణంగా ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకోగా, గుజరాత్‌లో ఇంకో జంట ఆత్మహత్యకు పాల్పడింది.
Indians Use Antibiotics: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న ఇండియన్స్.. టాప్‌లో అజిత్రోమైసిన్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుల్‌దీప్‌సింహ్ యాదవ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గోటా ఏరియాలోని ఒక బహుళ అంతస్థుల భవనంలో, 12వ అంతస్థులో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడి భార్య రిద్ధితో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి కూడా ఇద్దరిమధ్యా వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి తమ చిన్నారి కూతురును వెంటబెట్టుకుని 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Firecrackers In Delhi: ఢిల్లీలో బాణసంచా బ్యాన్.. జనవరి 1వరకు నిషేధిస్తూ ప్రభుత్వ నిర్ణయం
ముందుగా రిద్ధి బిల్డింగుపై నుంచి దూకింది. తర్వాత కూతురుతో కలిసి కుల్‌దీప్ దూకాడు. ముగ్గురూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
