రైల్లో మాజీ ఎమ్మెల్యే పై కాల్పులు

 గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్‌ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి గుజరాత్ కచ్ జిల్లాలో కటారియా - సుర్బరి స్టేషన్ల మధ్య సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో జయింతిలాల్ భానుశలిపై దాడి జరిగింది.

  • Publish Date - January 8, 2019 / 03:57 AM IST

 గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్‌ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి గుజరాత్ కచ్ జిల్లాలో కటారియా – సుర్బరి స్టేషన్ల మధ్య సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో జయింతిలాల్ భానుశలిపై దాడి జరిగింది.

గాంధీనగర్‌ :   గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్‌ భానుషలీ రైలులో దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి గుజరాత్ కచ్ జిల్లాలో కటారియా సుర్బరి స్టేషన్ల మధ్య సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో జయింతిలాల్ భానుశలిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. గుజరాత్‌ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, అబుదాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన జయంతీలాల్‌ పై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. గతంలో జయంతీలాల్‌ తనపై అకృత్యానికి పాల్పడ్డారంటూ సూరత్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ మహిళ డబ్బు కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిందంటూ ఆమె భర్త  చెప్పడంతో ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం అపుతున్నాయి.

జయంతీలాల్‌ పై వ్యక్తిగత పగతోనే దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించిందని, ఈ నేపథ్యంలో జయంతీలాల్‌ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డానే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు