శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.48.49 లక్షలు విలువ చేసే 1235 గ్రాముల బంగారాన్ని డీఐఆర్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ.48.49 లక్షలు విలువ చేసే 1235 గ్రాముల బంగారాన్ని డీఐఆర్ అధికారులు పట్టుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల నుంచి పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి తమకు బంగారం ఇచ్చినట్లు నిందితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారిస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ కు అడ్డగా మారింది. తరచుగా భారీగా బంగారం తరలిస్తూ ఎయిర్ పోర్టులో పట్టుబడుతున్నారు. విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసి సొమ్ముచేసుకోవాలని చూస్తున్నారు. భారీ ఎత్తున బంగారం, డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నారు.