ప్రేమజంటలను వేధించే పోకిరీలతో చేతులు కలిపిన ఖాకీలపై వేటు

పోలీసులు డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ఘటనల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

Disciplinary Action On Police : బాధితులకు అండగా నిలిచి న్యాయం చేయాల్సిన పోలీసులే దిగజారిపోతున్నారు. కంచే చేను మేసిన చందంగా కొందరు పోలీసులు తీరు ఉంది. బాధితుల పక్షాన నిలవాల్సిన ఖాకీలు.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో నిందితులతో చేతులు కలుపుతున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ కే మాయని మచ్చ తెస్తున్నారు. అలాంటి కొందరు ఖాకీల పాపం పండింది. ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు.

పోలీసులు డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ఘటనల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ భగాయత్ లో ప్రేమజంటను వేధించిన పోకిరీలతో చేతులు కలిపిన కేసులో ఎస్ఐ, సీఐలపై చర్యలు తీసుకున్నారు. సీఐ ఎలక్షన్ రెడ్డి, ఎస్ఐ శంకర్ లపై బదిలీ వేటు వేశారు.

ఉప్పల్ భగాయత్ లో ప్రేమజంటను వేధించిన కేసులో ఎస్ఐ, సీఐపై బదిలీ వేటు పడింది. నిందితులపై పెట్టిన కేసులో బాధితులను ఎస్ఐ, సీఐ డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అటు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఓ కేసులో అలసత్వం వహించిన సీఐ, ఎస్ఐ, ఎఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకుండా బాధితులను బెదిరించిన కేసులో ఇన్ స్పెక్టర్ పరుశురామ్ పై బదిలీ వేటు పడింది. ఎస్ఐ మధు, ఎఎస్ఐ అంజయ్యలను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉప్పల్ భగాయత్ లో నిందితులకు వకాల్తా పుచ్చుకున్న ఎస్ఐ, సీఐపై వేటు పడింది. సీఐ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా, ఎస్ఐని డీసీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు పోలీస్ స్టేషన్లలో రెండు ఘటనలకు సంబంధించి ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ, ఒక ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. ఉప్పల్ భగాయత్ లో తమను పోకిరీలు వేధించారని బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. నిర్లక్ష్యం వహించారు. న్యాయం చేయాల్సిన పోలీసులే.. నిందితులతో కాంప్రమైజ్ కావాలని బాధితులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ కేసులో ఎస్ఐ శంకర్ ని డీసీపీ ఆఫీసుకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ.. సీఐ ఎలక్షన్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. అంత పెద్ద ఇష్యూ జరిగినా.. ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు అంటూ ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిని సీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక నాగోల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులపై వేటు పడింది. సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐను విధుల నుంచి తొలగించారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కేసును పట్టించుకోలేదు అంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. నాగోల్ ఎస్ఐ పరుశురామ్, ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యను కూడా సస్పెండ్ చేశారు. నాగోల్ సీఐని సీపీ ఆఫీసులో అటాచ్ చేశారు.

Also Read : డీఎస్పీ కొంపముంచిన వివాహేతర సంబంధం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసు శాఖ

ట్రెండింగ్ వార్తలు