డీఎస్పీ కొంపముంచిన వివాహేతర సంబంధం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసు శాఖ

ఇంటికి వెళ్లటానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్ తో కలిసి కాన్పూర్ లోని ఓ హోటల్ కు వెళ్లాడు. అధికారిక, వ్యక్తిగత ఫోన్లను స్విచ్చాఫ్ చేసేశాడు. కనౌజియా ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్ కలవకపోవడంతో అతడి భార్య ఉన్నావ్ ఎస్పీని సంప్రదించారు.

డీఎస్పీ కొంపముంచిన వివాహేతర సంబంధం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసు శాఖ

DSP Demoted To Constable : ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు. కానీ, ఆ పోలీసు అధికారి చేసిన నిర్వాకం తనను మరో 10 మెట్లు కిందకు పడేసింది. డిమోషన్ అయ్యేలా చేసింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి యూపీ పోలీసు విభాగం తగిన బుద్ధి చెప్పింది. నేరానికి పాల్పడిన అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ అక్కడి పోలీసుశాఖ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ లో క్రిపా శంకర్ కనౌజియా అనే వ్యక్తి కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి చేరుకున్నారు. కానీ, అతడి బిహేవియర్ కొంప ముంచింది. మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు డీఎస్పీ స్థాయి అధికారి. అంతేకాదు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కూడా. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు ఉన్నావ్ లో సర్కిల్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. కుటుంబ కారణాలు చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు.

ఇంటికి వెళ్లటానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్ తో కలిసి కాన్పూర్ లోని ఓ హోటల్ కు వెళ్లాడు. అధికారిక, వ్యక్తిగత ఫోన్లను స్విచ్చాఫ్ చేసేశాడు. కనౌజియా ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్ కలవకపోవడంతో అతడి భార్య ఉన్నావ్ ఎస్పీని సంప్రదించారు. కనౌజియాపై ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు.. కాన్పూర్ లోని హోటల్ లో చివరిసారి అతడి ఫోన్ లొకేషన్ ను గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని అధికారితో పాటు ఆ మహిళా కానిస్టేబుల్ ను పట్టుకున్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన యూపీ పోలీస్ డిపార్ట్ మెంట్. లక్నో రేంజ్ ఐజీపీ దీనిపై సీరియస్ గా విచారణకు ఆదేశించారు.

దొంగ కారణాలు చెప్పి లీవ్ తీసుకోవడం, ఇంటికి వెళ్లకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో గడపటం.. ఇలా పలు ఆరోపణలతో ఆ పోలీసు అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు పైస్థాయి అధికారులు. ఈ మధ్యే విచారణ చేసిన అధికారులు.. ఆ నిర్లక్ష్యపు పోలీసు అధికారిని డిమోషన్ చేశారు. గోరక్ పూర్ బెటాలియన్ లోని ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ గా డిమోట్ చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీ పోలీసు శాఖ నిర్ణయం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకుని దిగజారిపోయిన పోలీసు అధికారికి తగిన శాస్తి జరిగిందని కామెంట్ చేస్తున్నారు.

Also Read : ఆ పనికి ఒప్పుకోనందుకు.. అత్తను దారుణంగా చంపిన పదో తరగతి బాలుడు