Hit-Run Incident Video : రోడ్డుపై వ్యక్తిని ఢీకొట్టిన కారు.. బానెట్‌పై వేలాడుతున్నా.. షాకింగ్ వీడియో..!

దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.

Hit Run Incident Video On C

Hit-Run Incident Video : దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. అంతే.. అతడు అంతఎత్తున పైకి ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. అప్పటికి ఆ కారు ఆగలేదు. కారు బానెట్‌పై అతడు వేలాడుతున్నా అలానే దూసుకెళ్లింది. వేలాడుతున్న వ్యక్తితో 200 మీటర్ల దూరం అలానే కారును నడిపాడు డ్రైవర్.. ఈ ఘటన ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

అలా కారు కొంత దూరం వెళ్లిన తరువాత బానెట్‌పై పడిన వ్యక్తి కిందికి జారి రోడ్డుమీద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాధిత వ్యక్తికి తీవ్రగాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయింది.

SUV బానెట్‌కి వేలాడుతున్న వ్యక్తితో వేగంగా వెళుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. SUV కారు వేగంగా దూసుకెళ్తూ రోడ్డుపై వెళ్లే వ్యక్తిపై దూసుకెళ్లినట్లు మరొక కెమెరాలోని ఫుటేజీ కనిపించింది. తీవ్రగాయాలపాలైన బాధితుడు 37 ఏళ్ల ఆనంద్ విజయ్ మండెలియాగా అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు ఆనంద్ విజయ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెజటిన్లు మండిపడుతున్నారు.

బాధితుడు ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని CCTV ఫూటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిందితుడు 27 ఏళ్ల న్యాయ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also : IPL auction 2022: వేలంలో “ఆ నలుగురు” కోసం భారీ డిమాండ్!