Man shot dead: ఫుడ్ సర్వ్ చేయలేదని హోటల్ యజమానిని కాల్చిచంపిన వైనం
అర్ధరాత్రి వేళ.. హోటల్ కు వచ్చిన తమకు ఫుడ్ సర్వ్ చేయలేదంటూ ఓ హోటల్ నిర్వాహకుడిని ఇద్దరు యువకులు కాల్చి చంపిన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది
- Bharath Reddy
- Published On : January 3, 2022 / 07:23 AM IST
Gun
Man shot dead: అర్ధరాత్రి వేళ.. హోటల్ కు వచ్చిన తమకు ఫుడ్ సర్వ్ చేయలేదంటూ ఓ హోటల్ నిర్వాహకుడిని ఇద్దరు యువకులు కాల్చి చంపిన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో గ్రేటర్ నోయిడా పరిధిలో కపిల్(27) అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నాడు. నోయిడా పరిధిలో రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కరోనా ఆంక్షలు విధించారు అధికారులు. శనివారం అర్ధరాత్రి సమయంలో కపిల్ హోటల్ మూసివేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆకాశ్, యోగేంద్ర అనే ఇద్దరు యువకులు తమకు పరోటా కావాలంటూ ఆర్డర్ చేసారు. అయితే హోటల్ మూసివేశామని.. ఇప్పుడు సర్వీస్ లేదంటూ కపిల్ చెప్పాడు.
Also read: Weather Update: మరికొన్ని రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే: తెలంగాణ వాతావరణశాఖ
అనంతరం ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వివాదం అనంతరం ఆకాష్, యోగేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు. కపిల్ పై కోపం పెంచుకున్న ఆకాష్, యోగేంద్రలు.. అర్ధరాత్రి దాటాక.. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో హోటల్ వద్దకు వచ్చి తుపాకీతో కపిల్ ని కాల్చి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని, తీవ్రంగా గాయపడిన కపిల్ ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కపిల్ మృతి చెందాడు. నిందితులు ఆకాష్, యోగేంద్రలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిద్దరూ తరచూ అదే హోటల్ కు వస్తుండేవారని పోలీసులు పేర్కొన్నారు
Also read: Movie Theater : కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన థియేటర్
