భార్యతో వీడియోకాల్‌ మాట్లాడుతూ సూసైడ్‌

  • Publish Date - September 21, 2019 / 03:10 PM IST

భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన .. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖని కళ్యాణ్ నగర్‌లో నివాసం ఉండే మహేందర్ వన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే సంగారెడ్డికి చెందిన ప్రియాంకతో మహేందర్‌కు వివాహం జరిగింది. 

మూడు రోజుల క్రితం ప్రియాంకకు జ్వరం రావటంతో పుట్టింటికి వెళ్ళింది. మహేందర్ సెకండ్‌ షిప్ట్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి ..భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ .. తాను జీవితం మీద విరక్తి చెందానంటూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు ఉంటున్న యాజమానికి ప్రియాంక సమాచారం ఇచ్చినా.. అప్పటికే మహేందర్ మృతి చెందాడు.