Meliaputti Murder Case
Husband Kills Wife : శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదంలో భార్య హత్యకు గురైంది. వివారాల్లోకి వెళితే…మెలియాపుట్టి మండలం భరణికోట గ్రామంలో భార్యాభర్తలైన సవర జగ్గారావు(38), పద్మలు నివసిస్తున్నారు. వారిద్దరి మధ్య ఆదివారం ఉదయం కుటుంబ విషయాలపై చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో జగ్గారావు తన వద్ద ఉన్న నాటు తుపాకితో భార్య సవర పద్మను కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మెలియాపుట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.