×
Ad

Uttar Pradesh: దారుణం.. జూదంలో భార్యను ఓడిన భర్త.. ఆ తర్వాత 8మంది కలిసి లైంగిక దాడి..!

భర్త పెట్టే వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతడి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. తాళి కట్టిన భర్తే కిరాతకానికి పాల్పడ్డాడు. జూదంలో భార్యను వేలానికి పెట్టాడు. అందులో అతడు ఓడిపోయాడు. దాంతో ఆమెపై భర్త స్నేహితులు 8మంది కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు.

మీరట్ కు చెందిన దనిష్ జూదానికి, మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో నిత్యం భార్యను కొట్టేవాడు. పేకాటకు అలవాటు పడ్డ దనిష్.. అందులో సర్వం పొగొట్టుకున్నాడు. ఇక అతడి దగ్గర ఏమీ మిగల్లేదు. దీంతో అతడు మరింత బరి తెగించాడు. ఈసారి ఏకంగా తన భార్యను జూదంలో వేలానికి పెట్టాడు. జూదంలో తన భర్త ఓడిపోవడంతో.. 8 మంది వ్యక్తుల తనపై లైంగిక దాడి చేశారని ఆమె వాపోయింది. తన స్నేహితులతో సంబంధం పెట్టుకోవాలని తన భర్త తనను వేదించేవాడని ఆమె ఆరోపించింది.

తనపై అత్యాచారం చేసిన 8మందిలో ముగ్గురిని బాధితురాలు గుర్తించింది. ఘజియాబాద్ కు చెందిన ఉమేశ్ గుప్తా, మోను, అన్షుల్ ఉన్నారు. తన భర్త కుటుంబసభ్యులు కూడా తనను కొట్టేవారని బాధితురాలు కన్నీటిపర్యంతం అయ్యింది. తన భర్త సోదరుడు, చెల్లెలి భర్త కూడా తనపై లైంగిక దాడి చేశారని తెలిపింది. తాను కట్నం తీసుకురాలేదని, అందుకే వారితో సంబంధం పెట్టుకోవాలని తన భర్త టార్చర్ పెట్టేవాడని బాధితురాలు వాపోయింది. తన గర్భం కూడా తీయించేశారని, తన కాళ్లపై యాసిడ్ పోశారని తెలిపింది. అంతేకాదు నదిలోకి తోసి తనను చంపాలని చూశారని ఆరోపించింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు తనను కాపాడారని ఆమె తెలిపింది.

భర్త పెట్టే వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతడి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, కేసు వాపస్ తీసుకోవాలని తన తండ్రిని తన భర్త బెదిరించాడని ఆమె తెలిపింది.

Also Read: అమెరికాలో ఏపీ మహిళ దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 8ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ.. నిందితుడిని పట్టించిన ల్యాప్ టాప్..!