నడిపేది రోడ్డుపైనేనా : ఆ రెండు కార్లకు 222 ట్రాఫిక్ చలాన్లు

హైదరాబాద్ నగరంలో రోడ్లపై రయ్ రయ్ మంటూ బైక్, కార్లపై దూసుకెళ్తున్నారా? ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారా? పోలీసుల కన్నుగప్పి రోడ్లపైకి వస్తే అంతే సంగతులు.

  • Publish Date - January 30, 2019 / 07:44 AM IST

హైదరాబాద్ నగరంలో రోడ్లపై రయ్ రయ్ మంటూ బైక్, కార్లపై దూసుకెళ్తున్నారా? ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారా? పోలీసుల కన్నుగప్పి రోడ్లపైకి వస్తే అంతే సంగతులు.

హైదరాబాద్ నగరంలో రోడ్లపై రయ్ రయ్ మంటూ బైక్, కార్లపై దూసుకెళ్తున్నారా? ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారా? ట్రాఫిక్ జరిమానా చలాన్లు చెల్లించకుండా పోలీసుల కన్నుగప్పి రోడ్లపైకి వస్తే అంతే సంగతులు. ముందుగానే జరిమానా వేసిన చలాన్లు కట్టేస్తే సరేసరి. లేదంటే అడ్డంగా బుక్కయి పోతారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనాదారులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) సహా నగరంలోని ప్రధాన కూడల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది. ఇప్పటివరకూ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినవారిపై 222 వరకు చెలాన్లు పెండింగ్ లో ఉండగా.. వేలాది రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంది. ఒక్కో వాహనాదారుడిపై వందలాది చలాన్లు పెండింగ్ లో ఉండటంతో పోలీసులే షాక్ అవుతున్నారు.

 

రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో సైబరాబాద్ పోలీసులు డ్రైవ్ నిర్వహించగా రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రెండు వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లు చూసి పోలీసులే నివ్వెరపోయారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఈ రెండు వాహనాలపై వందకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు. మరో వెహికల్ పై వేలాది రూపాయల చలాన్లు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు. మహీంద్ర ఎక్స్ వైఎల్ఓ (టీఎస్ 078 UA 9202) ఎల్లో నెంబర్ ప్లేట్ క్యాబ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ కారు సింహేందర్ రాం అనే వ్యక్తిపై రిజిస్ట్రర్ అయింది. 

 

ఇతగాడిపై ఏకంగా 120 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో రాంగ్ పార్కింగ్ ఉంటే.. మరికొన్ని సిగ్నల్ జంపింగ్ వంటి 100 కేసులు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు. మొత్తం పెండింగ్ లో ఉన్న చలాన్లపై సదరు కారు డ్రైవర్ చెల్లించాల్సిన జరిమానా రూ.19,930 వరకు ఉన్నట్టు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు పట్టకున్న (టీఎస్ 32 టీ2444) అనే నెంబర్ కారుపై 100 చెలాన్లు పెండింగ్ లో  ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోనే ఈ జరిమానాలు విధించినట్టు గుర్తించారు. ఈ కేసులో ఓఆర్ఆర్, రాంగ్ పార్కింగ్ సంబంధిత చలాన్లతో కలిపి మొత్తం రూ.16,565 వరకు జరిమానా చెల్లించాల్సి ఉందని గుర్తించారు. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో ఎన్నో కార్లను రాంగ్ సైడ్ పార్కింగ్ చేస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ లో గుర్తించారు. 

 

పెండింగ్ లో చెలాన్లు మొత్తం చెల్లించాక మాత్రమే వాహనాలను తిరిగి అప్పగిస్తామని ట్రాఫిక్ పోలీసులు తేల్చిచెప్పేశారు. చెలాన్లు చెల్లించని వాహనాల యజమానులపై చార్జ్ షీట్ నమోదు చేసి కోర్టులో సమర్పిస్తామని, వారికి కోర్టు తగిన శిక్ష విధిస్తుందని గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కే.రాములు చెప్పారు. మీ వాహనాలపై కూడా ఏమైనా చెలాన్లు పెండింగ్ లో ఉన్నాయో లేదో అధికారిక వెబ్ సైట్ లో ఈ లింక్ https://www.echallan.org/publicview చేసుకోవచ్చు.