Instagram Trap: డబ్బున్న మైనర్ అమ్మాయిలే టార్గెట్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రాప్.. ముఠా గుట్టు రట్టు
ఈ గ్యాంగ్ విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలను టార్గెట్‌గా చేసుకుంది. ప్రముఖ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినులపై ప్రత్యేక నిఘా పెడతారు.
- Naveen
- Published on- April 19, 2026 / 07:39 PM IST
Instagram Trap: డబ్బున్న మైనర్ అమ్మాయిలే వారి టార్గెట్. ఇన్ స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేస్తారు. ఇలా ఇప్పటికే పలువురిని మోసం చేసిన ఈ ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బున్న మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలను టార్గెట్‌గా చేసుకుంది. ప్రముఖ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థినులపై ప్రత్యేక నిఘా పెడతారు. ప్రముఖ పబ్బుల్లో తిరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులతో మోసం చేస్తారు. హైదరాబాద్ పబ్బుల్లో తిరుగుతూ మైనర్లను ట్రాప్ చేస్తోంది ముఠా. పారిశ్రామికవేత్తల పిల్లలను లక్ష్యంగా చేసుకున్న నిందితులు.. మైనర్లతో వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ కు దిగుతారు. వీడియోలు అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
ఇదే క్రమంలో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురిని ట్రాప్ చేసి డబ్బులు గుంజిందీ ముఠా. ఇంటి పని వాళ్ల ద్వారా మైనర్ అమ్మాయిల కదలికలపై ఈ గ్యాంగ్ నిఘా పెడుతుందని పోలీసులు తెలిపారు. ప్రముఖ స్కూల్ విద్యార్థినిని ట్రాప్ చేసి డబ్బులు దోపిడీ చేసినట్లు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ కేంద్రంగానే ఈ గ్యాంగ్ మోసాలకు పాల్పడింది. కీలక నిందితుడు అర్జున్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షీ టీమ్స్ చర్యలతో ఈ కంత్రీ గ్యాంగ్ కార్యకలాపాలు బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు.
