Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో ట్రాన్స్‌జెండర్ల హత్య

హత్యలతో పాతబస్తీ వణికిపోతోంది. నేరాలకు అడ్డాగా మారుతున్న ప్రాంతంలో వరుస హత్యలు స్థానికుల్ని వణికిస్తున్నాయి.

transgenders assassinate

d transgenders assassinate In HYD : హైదరాబాద్ లోని పాతబస్తీలో ట్రాన్స్ జెండర్ల హత్యతో మరోసారి కలకలం రేగింది. ఇటీవల పాతబస్తీ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న హత్యలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు అత్యంత దారుణంగా హత్యకు గురి అయ్యారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవతున్నారు. టప్పాచబుత్ర లో మంగళవారం (జూన్ 20,2023) రాత్రి సమయంలో కొంతమంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేసారు.కత్తులు, బండరాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశారు.

ఈ హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.టప్పచబుత్ర పరిధిలోని దైబాగ్ ప్రాంతంలో హత్యకు గురి అయిన ట్రాన్స్ జెండర్లను 25 ఏళ్ల యూసుఫ్ అలియాస్ డాలి, 30 ఏళ్ల రియాజ్ అలియాస్ సోఫియాలుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీనలను పరిశీలిస్తున్నారు. హత్య చేయడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉందని తెలిపారు.

Maharashtra : మహా దారుణం .. కూలీలను గొలుసులతో కట్టేసి బావులు తవ్విస్తున్న కాంట్రాక్టర్లు

వివాహేతర సంభంధం ఈ హత్యలకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఘటనాస్థలంలో పడి ఉన్న కత్తులను పోలీసులు స్వాధీననం చేసుకున్నారు. వాటిపై ఉండే వేలి ముద్రల ఆధారంగా కూడా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.