Maharashtra : మహా దారుణం .. కూలీలను గొలుసులతో కట్టేసి బావులు తవ్విస్తున్న కాంట్రాక్టర్లు

ఈరోజుల్లో కూడా వెట్టిచాకిరీ ఘటనలు కనిపిస్తున్నారు. మనుషుల్ని పశువుల్లా కట్టేసి పనులు చేయించుకుంటున్న అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఇనుప గొలుసులతో బంధించి బావులు తవ్విస్తున్నారు కాంట్రాక్టర్లు.

Maharashtra : మహా దారుణం .. కూలీలను గొలుసులతో కట్టేసి బావులు తవ్విస్తున్న కాంట్రాక్టర్లు

Maharashtra

Maharashtra Migrant laborers : మహారాష్ట్రలో అత్యంత అమానవీయమన ఘటన వెలుగులోకి వచ్చింది. కూలీలను పశువులను కట్టినట్లుగా కట్టేసి వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న కాంట్రాక్టర్ల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన కూలీలతో కాంట్రాక్టర్లు అంత్యత దారుణంగా వారు ఎక్కడికి వెళ్లకుండా కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోవానికి వెళ్లకుండా బావులు తవ్విస్తున్నారు. ఆ బావుల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలని ఆ తరువాత వాటిని బక్కెట్లలోకి ఎత్తి వారిచేతనే పారవేయిస్తున్న అమానవీయ ఘటన బయటపడింది. కనీసం కడుపునిండా తిండికూడా పెట్టకుండా కూలీలలను ఇనుప గొలుసులతో కట్టేసి మరీ పనిచేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు..

Divorce,Rupee Coins : భార్యకు భరణంగా ఏడు బస్తాల నాణేలు కోర్టుకు తెచ్చిన భర్త .. షాకిచ్చిన జడ్జి

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో బావులు తవ్వటం కోసం కూలీలను తీసుకొచ్చి వారితో రోజుకు 12గంటలు పనిచేయించుకుంటున్నారు సంతోశ్ జాదవ్, కృష్ణ శిందే అనే కాంట్రాక్టర్లు. కూలీలతో అత్యంత దారుణమైన చాకిరీ చేయించుకుంటున్నారు. మూడు నెలలుగా వలస కూలీలతో దారుణమైన పనులు చేయించుకుంటున్నారు. రోజుకు 12గంటలు చాకిరీ చేయించుకుంటున్నారు. ఇటువంటి నిర్భంధంతో పనిచేయలేక కూలీలు రాత్రి సమయంలో పారిపోతారని వారిని గొలుసులతో బంధించి ఉంచుతున్నారు ఏదో పశువులను కట్టేసినట్లుగా.

రోజుకు 12 గంటలు పని చేయించుకోవటమే కాకుండారోజుకు ఒకే ఒక్కసారి భోజనం పెట్టేవారు. తెల్లవారు ఝామునే బావుల్లోకి దిగాలి. మలమూత్ర విసర్జన కూడా తవ్వే బావుల్లోనే కానిచ్చుకోవాలి. ఆ మలాన్ని వారే మళ్లీ బకెట్లకు ఎత్తించి బయటకు పోయించేవారు. హింగోలీకి చెందిన 12 మంది కూలీల చేత ఇలా చేయించి ఒక్క రూపాయి కూలీ కూడా ఇవ్వలేదు. వారు పారిపోకుండా బంధించి మరీ పనులు చేయించుకుంటున్నారు.

India-China Relations: చైనా-భారత్ సరిహద్దు పరిస్థితిపై భారత్ వైఖరి స్పష్టం చేసిన ప్రధాని మోదీ

అలా కంటినిండా నిద్ర లేకుండా..కడుపు నిండా తిండి లేక అలసిపోయిన వారు ధైర్యం చేసి ఓ రోజు కొంతమంది తప్పించుకున్నారు. పోలీసులను ఆశ్రయించారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము పడే బాధల్ని చెప్పుకుని వాపోయారు. అది విన్న పోలీసులు బావుల తవ్వే ప్రాంతానికి వెళ్లి 11 మంది కూలీలకు విముక్తి కల్పించారు. వారిని వెంటనే ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. దీనికి కారణమైన ఇద్దరు కాంట్రాక్టర్లు సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.