Divorce,Rupee Coins : భార్యకు భరణంగా ఏడు బస్తాల నాణేలు కోర్టుకు తెచ్చిన భర్త .. షాకిచ్చిన జడ్జి

280 కిలోల చిల్లర నాణాలు భార్యకు భరణంగా ఇవ్వటానికి తెచ్చిన భర్తకు న్యాయమూర్తి షాకిచ్చారు.

Divorce,Rupee Coins : భార్యకు భరణంగా ఏడు బస్తాల నాణేలు కోర్టుకు తెచ్చిన భర్త .. షాకిచ్చిన జడ్జి

Rajasthan Court..Divorce Rupee Coins

Updated On : June 21, 2023 / 10:35 AM IST

Rajasthan Court : రాజస్థాన్ కోర్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తపై వరకట్నం కేసు పెట్టింది. భర్త నుంచి భరణం ఇప్పించాలని కోరుతు కోర్టుకెక్కింది. దీనిపై విచారణ కొనసాగిన క్రమంలో తాజాగా ఈకేసులో న్యాయమూర్తి భార్యకు రూ.55,000 భరణం (జీవన భృతి) చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దీంతో భర్త భార్యకు భరణం చెల్లించేందుకు ఏకంగా ఏడు బస్తాల చిల్లర నాణాలు పట్టుకొచ్చాడు. అవన్నీ రూపాయి, రెండు రూపాయలు, పది రూపాయల నాణాలు. ఆ నాణాలు మొత్తం 280కిలోల బరువున్నాయి. దీంతో జడ్జి షాక్ అయ్యారు. సదరు భర్తకే షాకిచ్చారు. జడ్జి ఇచ్చిన ఆదేశాలకు సదరు వ్యక్తి నోరెళ్లబెట్టాడు. ఈ ఆసక్తి

రాజస్థాన్ లోని జైపూర్ హర్మదా ప్రాంతానికి చెందిన దశరథ్ కుమావత్ అనే వ్యక్తికి 12 ఏళ్ల కిందట సీమా అనే మహిళతో వివాహమైంది. కొంతకాలం తరువాత సీమ భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసు గత ఐదేళ్లుగా విచారణ కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా ఈకేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి భార్యకు భరణం కింద నెలకు రూ.55,000వేలు చెల్లించాలని దశరథ్ ను ఆదేశించింది.

Maharashtra: సివిల్ ఇంజినీర్ గల్లాపట్టి చెంప పగలగొట్టిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్

కోర్టు ఆదేశాలను దశరథ్ పట్టించుకోలేదు. దీంతో అతనికి జూన్ 17న అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీంతో అతని కుటుంబసభ్యులు దిగి వచ్చారు. భరణం చెల్లించే డబ్బులు పట్టుకుని కోర్టుకు వచ్చారు.అవన్నీ చిల్లర నాణాలు. అలా ఏడు బస్తాల నాణాలు పట్టుకుని వచ్చారు. ఆ బస్తాలు చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వాటిని విప్పి చూడగా అందులో అన్నీ ఒక్క కరెన్సీ నోటు కూడా లేకపోగా.. అన్నీ నాణేలే. అవన్నీ రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలే. అలా మొత్తం ఏడు బస్తాలు పట్టుకొచ్చారు. అవి మొత్తం 280 కేజీలు.

చిల్లర నాణాలు తేవటంతో సీమా తరపు న్యాయవాది రామ్ ప్రకాశ్ కుమావత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింటుకు చెల్లించాల్సిన జీవనభృతిని నాణేల రూపంలో ఇవ్వాలనుకోవటం కక్షసాధింపు చర్య కిందకే వస్తుందంటూ వాదించారు. మరోవైపు న్యాయమూర్తిగా ఇది సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో ఇవన్నీ లెక్కకట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీదే అంటూ షాకిచ్చారు. దీంతో వినూత్న ఆదేశాలు జారీ చేస్తు.. జైల్లో ఉన్న దశరథ్ ఈ నాణేలను రూ.1000 చొప్పున బ్యాగుల్లో ఉంచి, ఈజీ లెక్కపెట్టేందుకు వీలుగా కోర్టుకు అందించాలని ఆదేశించారు. పైగా జూన్ 26 లోగా ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు.

Women Height Increased: మోదీ ప్రభుత్వంలో జరిగిన అద్భుతం.. మహిళలు ఎత్తు పెరుగుతున్నారట!

 

Rajasthan, Man,court, to pay maintenance dues of Rs 55,000 in rupee coins