India-China Relations: చైనా-భారత్ సరిహద్దు పరిస్థితిపై భారత్ వైఖరి స్పష్టం చేసిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తాను చాలాసార్లు మాట్లాడానని అన్న ఆయన.. ఘర్షణలను పరిష్కరించి ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకు వచ్చేందుకు నిబద్ధతతో జరిగే అన్ని ప్రయత్నాలను భారత్ సమర్ధిస్తుందని మోదీ తెలిపారు.

India-China Relations: చైనా-భారత్ సరిహద్దు పరిస్థితిపై భారత్ వైఖరి స్పష్టం చేసిన ప్రధాని మోదీ

PM Modi

PM Modi: చైనాతో భారత్ మెరుగైన సంబంధాలు ఆచరణలోకి రావాలంటే సరిహద్దుల్లో ప్రశాంతతోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భారతదేశం తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు. మంగళవారం ఆయన అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనాతో సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికాతో భారత్‌కు ఉన్న బంధం వంటి పలు అంశాలపై ప్రధాని స్పందించారు.

Odisha Train Accident Probe:ఒడిశా రైల్వే సిగ్నల్ ఇంజినీర్ అదృశ్యం..ఇంటిని సీజ్ చేసిన సీబీఐ

”సార్వభౌమత్యాన్ని, ప్రాదేశిక సమగ్రతలను ఇండిగా బలంగా నమ్ముతుంది. చట్టబద్ధమైన పాలనను పాటిస్తూ, విభేదాలు, వివాదాల విషయంలో శాంతియుత పరిష్కారాన్ని భారత్ కోరుకుంటుంది. ఇదే సమయంలో దేశ సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉంటుంది” అని మోదీ అన్నారు. ఇక మెరికాతో సంబంధాలపై ఆయన స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు న్యూఢిల్లీపై ‘అసాధారణమైన నమ్మకం ఉందన్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో విస్తృతమైన పాత్ర పోషించేందుకు భారత్ అర్హమైందని.. విద్య, మౌలిక సదుపాయపై విస్తృత పెట్టుబడులు పెడుతున్నామని, అనేక బహుళజాతి సంస్థలు సైతం తమవైపు చూస్తున్నాయని, ప్రపంచంలో తాము సముచిత స్థానాన్ని దక్కించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Mumbai : కొట్లాటలు, అరుపులు మర్చిపోయారు.. ట్రైన్‌లో కిషోర్ కుమార్ పాట పాడుతూ ఎంజాయ్ చేసిన ప్రయాణికులు

చివరగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుతూ ‘‘ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోందని కొందరు అంటున్నారు. అయితే అది సరికాదు. మేము తటస్థంగా లేము. శాంతివైపే ఉన్నాం” అని మోదీ స్పష్టం చేశారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలు, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వివాదాలు ఉంటే వాటిని దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధంతో కాదని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తాను చాలాసార్లు మాట్లాడానని అన్న ఆయన.. ఘర్షణలను పరిష్కరించి ఇరుదేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకు వచ్చేందుకు నిబద్ధతతో జరిగే అన్ని ప్రయత్నాలను భారత్ సమర్ధిస్తుందని మోదీ తెలిపారు.