Odisha Train Accident Probe:ఒడిశా రైల్వే సిగ్నల్ ఇంజినీర్ అదృశ్యం..ఇంటిని సీజ్ చేసిన సీబీఐ

ఒడిశా ట్రిపుల్ రైలు ప్రమాద దుర్ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ రైలు ప్రమాదం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు....

Odisha Train Accident Probe:ఒడిశా రైల్వే సిగ్నల్ ఇంజినీర్ అదృశ్యం..ఇంటిని సీజ్ చేసిన సీబీఐ

రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ

Updated On : June 20, 2023 / 6:16 PM IST

Odisha Train Accident Probe: ఒడిశా ట్రిపుల్ రైలు ప్రమాద దుర్ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ రైలు ప్రమాదం దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోరో సెక్షన్ రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి వచ్చారు. సోరో పట్టణంలో రైల్వే సిగ్నల్ జేఈ అద్దెకు ఉంటున్న ఇంట్లో అమీర్ ఖాన్ లేకపోవడంతో(Signal Engineer Goes Missing) సీబీఐ అధికారులు ఆ ఇంటికి సీలు వేశారు. అనంతరం సీబీఐ సిబ్బంది సిగ్నల్ జేఈ ఇంటిపై నిఘా వేసి ఉంచారు. సీబీఐ అధికారులు గతంలో రైల్వే సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ను రహస్య ప్రదేశంలో ప్రశ్నించారు.(After Questioning CBI)బహనాగా రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 292 మంది ప్రయాణీకులు మరణించారు. ఈ రైలు ప్రమాద ఘటన తర్వాత సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్, అతని కుటుంబం అద్దె ఇంటి నుంచి నుంచి పారిపోయారని సమాచారం.మరోవైపు సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం బహనాగా స్టేషన్‌ మాస్టర్‌ ఇంటికి కూడా వెళ్లారు.