Indore Student Case Representative Image (Image Credit To Original Source)
Indore Case: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సంచలనం రేపిన 24ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రియుడు చేసిన దారుణాలు తెలుసుకుని పోలీసులే షాక్ అవుతున్నారు. ప్రియురాలిని హత్య చేసిన అతడు.. ఆమె ఆత్మను వెనక్కి రప్పించేందుకు తాంత్రిక పూజలు చేశాడు. ఇందుకోసం అతడు యూట్యూబ్ ను ఆశ్రయించాడు. ఆత్మతో మాట్లాడటం ఎలా అనేది యూట్యూబ్ లో సెర్చ్ చేశాడు.
”ప్రియురాలి గొంతు కోసి చంపడమే కాకుండా ఆమె శరీరాన్ని హింసించాడు. మృతదేహం పక్కనే మద్యం సేవించాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కడుపులో కత్తితో పొడిచాడు. తర్వాత ఆత్మలతో మాట్లాడేందుకు ఆన్‌లైన్‌లో మార్గాలను శోధించాడు” అని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన ఆందోళనకు గురి చేసే నిందితుడి తీవ్రమైన క్రూరత్వాన్ని, అతడి మానసిక అస్థిరతను సూచిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. స్నేహితురాలిని ఎందుకు చంపావని పోలీసులు అడగ్గా.. “జరగాల్సినది జరిగిపోయింది” అంటూ ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నిందితుడు మాట్లాడటం చూసి అంతా విస్తుపోతున్నారు.
ఫిబ్రవరి 13న ఈ దారుణం వెలుగు చూసింది. ద్వారకాపురి ప్రాంతంలోని అద్దె ఫ్లాట్‌లో దుర్వాసన వస్తోందని పొరుగు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూసేసరికి మంచం మీద అమ్మాయి డెబ్ బాడీ ఉంది. నగ్నంగా పడి ఉంది. ఆమె మెడ చుట్టూ తాడు గుర్తులు కనిపించాయి. మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆమె చేతులు, కాళ్ళు కట్టేసి ఉన్నాయి. ఆమె అరవకుండా నోటిలో ప్లాస్టిక్ నింపాడు.
”నిందితుడి పేరు పియూష్ ధమ్నోడియా. ఇద్దరూ దాదాపు ఒక సంవత్సరం నుండి రిలేషన్ లో ఉన్నారు. నిందితుడు అభద్రతతో ఉన్నాడు. పెళ్లి విషయంలో తరచుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఆమె ఇతర మగాళ్లతో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో తట్టుకోలేకపోయాడు” అని పోలీసులు తెలిపారు.
”ఫిబ్రవరి 10న నిందితుడు ఆ మహిళను తన అద్దె గదికి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉంది. వివాహం విషయంలో వివాదం చెలరేగింది. కోపంతో గొంతు కోసి చంపాడు. కడుపులో కత్తితో పొడిచి చంపానని నిందితుడు చెప్పాడు. ఆమె శవాన్ని దూషించినట్లు అంగీకరించాడు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. హత్య తర్వాత అతను గదిలోనే ఉన్నాడు. మృతదేహం పక్కనే మద్యం సేవించాడు. ప్రియురాలిని హత్య చేసిన తర్వాత నిందితుడు ఇండోర్ నుండి రైల్లో మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు” అని పోలీసులు చెప్పారు.
ఆత్మలతో మాట్లాడటం ఎలా? అనే దానిపై నిందితుడు ఇంటర్నెట్, యూట్యూబ్‌లో శోధించాడని పోలీసులు తెలిపారు. ఆత్మను తీసుకొచ్చేందుకు క్షుద్ర పూజలు చేశాడని చెప్పారు. ”ఆత్మలతో ఎలా మాట్లాడాలో అతను ఆన్‌లైన్‌లో శోధించాడు. తాంత్రిక పూజలు కూడా చేశాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదు అనిపిస్తోంది” అని పోలీసులు అన్నారు.
పన్వేల్ కి పారిపోయిన నిందితుడు.. అక్కడి నుంచి ముంబైకి వెళ్లాడు. ఫిబ్రవరి 14న అరెస్ట్ అయ్యే ముందు స్థానిక రైళ్లలో తిరుగుతూ గడిపాడు. నిందితుడు యువతి కుటుంబానికి బాగా తెలిసిన వాడే. వారి ఇంటికి తరచుగా వెళ్లేవాడు. ఇద్దరికీ ఒక సంవత్సరం పాటు పరిచయం ఉంది. తన కుమార్తె తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని తండ్రి ఆరోపించాడు. నిందితుడు ఆమె అశ్లీల ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు.
అరెస్ట్ తర్వాత నిందితుడిని మీడియాతో ముందకు తీసుకొచ్చారు పోలీసులు. ఇంత జరిగినా అతడిలో ఎలా పశ్చాతాపం కనిపించలేదు. ఎందుకు హత్య చేశాడు అని మీడియా అతడిని ప్రశ్నించగా.. “అన్నీ మర్చిపోండి. జరగాల్సింది జరిగిపోయింది. తెలుసుకోవడం ద్వారా మీరు ఏమి చేస్తారు?” అని ఎదురు ప్రశ్నించాడు. “సమయం వచ్చినప్పుడు నేను చెబుతాను” అని కూడా అన్నాడు.
”ఇండోర్‌కు చెందిన యువతి ఎంబీఏ చదువుతోంది. పీయూష్ తో ప్రేమలో ఉంది. జనవరి 11న పీయూష్ యువతిని ద్వారకాపురిలోని తన ఫ్లాట్‌కు పిలిచాడు. అక్కడ ఇద్దరూ సన్నిహితంగా గడిపారు. తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చింది. అయితే ఆమె వేరే వ్యక్తులతో చాటింగ్ చేస్తోందనే అనుమానం పెంచుకున్నాడు పీయూష్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన పీయూష్ ఆమె గొంతు నులిమి చంపేశాడు.
హత్య తర్వాత పీయూష్ సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేశాడు. మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్‌లో బస చేసిన అతడు తాను చంపిన యువతి ఆత్మను తిరిగి రప్పించేందుకు తాంత్రిక పూజలు చేశాడు. ఆ తర్వాత ముంబైకి పారిపోయాడు. పోలీసులకు చిక్కకుండా రాత్రంతా లోకల్ రైళ్లలో తిరుగుతూ గడిపాడు. ఫిబ్రవరి 13న పీయూష్ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా మంచంపై నగ్నంగా ఉన్న యువతి మృతదేహం కనిపించింది” అని పోలీసు అధికారులు తెలిపారు.