ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్ధిని దారుణ హత్య

  • Publish Date - January 24, 2020 / 05:04 AM IST

సికింద్రాబాద్ వారాసిగూడలో దారుణం జరిగింది. ఇంటర్నీడియెట్ చదువుతున్నఅరిఫా అనే విద్యార్ధిని  ప్రేమపేరుతో ఒక యువకుడు హత్య చేశాడు. విద్యార్ధినిపై షోయబ్ అనే యువకుడు  అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా  తెలిసింది 

ఇంటర్ విద్యార్ధిని హత్య కేసులో  చిలకలగూడా  పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారమే యువతి దారుణ హత్యకు కారణమని  తేలింది. ఈ కేసులో షోయబ్ అనే యువకుడితో రపాటు మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

షోయబ్ ఇటీవలి కాలంలో ఆమెను ప్రేమ  పేరుతో వేధిస్తున్నాడని… పెళ్లి చేసుకుంటానని కూడా  షోయబ్ వెంటపడతున్నాడని కుటుంబ సభ్యులుతెలిపారు. కాగా ఇద్దరూ మైనర్లే కాబట్టి మేజర్లు అయిన తర్వాత పెళ్ళి విషయం ఆలోచిద్దామని యువతి కుటుంబ సభ్యులు  వాయిదా వేశారు. కాగా షోయబ్  మానసిక స్ధితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

రెండు పెద్ద అపార్ట్ మెంట్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో  యువతి మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె తలపై బలమైన గాయాలన్నాయి. యువతిపై అత్యాచారంచేసి, హత్యచేసి బిల్డింగ్ పైనుంచి కిందకుపడేసినట్లు తెలిసింది,  బిల్డింగ్ పైన కొన్ని రక్తపు మరకలను క్లూస్ టీం గుర్తించింది.  మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.