దిశ ఘటన మరువక ముందే విద్యార్ధిని కిడ్నాప్ 

  • Publish Date - December 5, 2019 / 06:34 AM IST

దేశవ్యాప్తంగా మహిళలకు  భద్రత కరువైందని మహిళాలోకం ఓవైపు నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మరో వైపు చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్ధిని కిడ్నాప్ వ్యవహారం కలకంల రేపింది.

చిత్తూరు జిల్లా కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న  అనుప్రియ అనే బాలికను సతీష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు బాలిక తల్లితండ్రులు ఆరోపించారు. అనుప్రియ బుధవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా సతీష్ వెంబడించి ఆమెను కారులో తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. 

గతంలోనూ ఒకసారి సతీష్ అనుప్రియను కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించాడని తల్లి తండ్రులు చెబుతున్నారు. తమబిడ్డను క్షేమంగా తమకు అప్పగించాలని వారు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు పీలేరు-కడపరోడ్డు లోని సీసీ కెమెరాల ఫుటేజిని పరీశీలిస్తున్నారు.