విశాఖలో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల కలకలం రేగింది. భారీగా టికెట్లు బ్లాక్ చేసి ఎక్కువ రేట్ కు అమ్ముతున్నట్లు గుర్తించారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 109 టికెట్లు, రూ.40 వేలు నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
స్టేడియం సిబ్బంది సహకారంతోనే బ్లాక్ టికెట్ల దందా జరుగుతుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. స్టేడియం సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని స్పష్టంగా తెలుస్తోంది. విశాఖలో హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. (మే 10, 2019)న మరో ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది.