మాములోడు కాదు : పోలీసులతో కలిసి రాకేష్ సెటిల్మెంట్లు

చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

  • Publish Date - February 17, 2019 / 10:59 AM IST

చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

హైదరాబాద్ : చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులతో కలిసి రాకేష్ రెడ్డి సెటిల్ మెంట్లు పాల్పడినట్లు తేలింది. హైదరాబాద్ శివార్లలో భారీగా సెటిల్ మెంట్లు చేశాడు. సెటిల్ మెంట్ల సమయంలో పోలీసులకు భారీగా ముట్టజెప్పినట్లు తేలింది. ఒక్కో సెటిల్ మెంట్ కు పోలీస్ అధికారులకు భారీగా నజరానా ఇచ్చాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాదాపూర్, శేరిలింగంపల్లి, హయత్ నగర్, ఆదిభట్ల, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో సెటిల్ మెంట్లు చేశాడు. 

 

ఖాళీ స్థలాలపై లిటిగేషన్ సృష్టించి పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్ దందా పేరుతో పోలీసులతో కలిసి వ్యాపారులకు టోకరా పెట్టాడు. 11 మంది పోలీస్ అధికారులతో సంబంధాలున్నట్లు ప్రాథమిక సమాచారం. రాకేష్ తో సంబంధాలున్న అధికారులను పోలీసులు అంతర్గతంగా విచారించనున్నారు. క్రిమినల్ కు పోలీసుల అండదండలు ఉండటమనేది చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు పోలీసులు ఎంతమందిపై చర్యలు తీసుకుంటారు? ఎంతమంది పేర్లను బయటపెడతారన్నది చూడాలి మరి. 

 

జయరామ్ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పోలీసుల విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే హత్య కేసులో ప్రధాని నిందితుడు రాకేష్ రెడ్డి, శ్రిఖా చౌదరిని పోలీసులు విచారించారు. వారి నుంచి పలు విషయాలు రాబట్టారు. ఇప్పటికీ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతూనేవుంది. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో అనుమానితులందరినీ విచారిస్తున్నారు.