ముంబై : ప్రముఖ సినీ నిర్మాత..మాజీ ఎన్సీపీ మెంబర్ సందానంద్ గుడిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఓ బిల్డర్ తనను వేధిస్తున్నాడని సందానంద్ ఉరి వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంఎస్ అలీ రోడ్డులో ఉన్న లాండాంచా గణపతి దేవాలయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సదానంద్ అలియాస్ పప్పూ లాడ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఉరి వేసుకున్న దేవాలయంలోనే సూసైడ్ నోట్ ను గుర్తించారు. ఓ బిల్డర్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని..వేధింపులను తట్టుకోలేకనే ప్రాణాలు తీసుకుంటున్నాననీ సూసైడ్ నోట్ లో వుందని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎల్జీ ప్రొడక్షన్స్ పేరుతో ఓ బ్యానర్ ను ఏర్పాటు చేసిన పప్పూ లాడ్..పలు మరాఠీ సినిమాలకు నిర్మించారు.
ముంబైలో తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్న పప్పూ లాడ్ గిర్గాంలోని తన ఇంటికి వద్ద ఉన్న గణపతి దేవాలయానికి రోజు వెళ్లి దర్శనం చేసుకోవటం అలవాటు. ఈ క్రమంలో జనవరి 16న కూడా దర్శనానికని వెళ్లిన పప్పూ లాడ్ దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ పూజారితో కాసేపు మాట్లాడారు. తరువాత పక్కన ఉన్న ఓ రూమ్ లో రెస్ట్ తీసుకుంటానని చెప్పి రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకున్నారు. రూమ్ లో నుండి పప్పూ లాడ్ ఎంతకీ రాకపోవటంతో వెళ్లి చూసిన పూజారి పప్పులాడ్ ఫ్యాన్ కి ఉరేసుకొని కనిపించిటంతో షాక్ అయ్యారు. దీంతో పూజారి పోలీసులకు ఫోన్ చేసి తెలిపారు. ప్రముఖ బిల్డర్ వేధింపుల కారణంగా ఆయన సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తమకు ఎంతో ధైర్యాన్నిచ్చే పప్పులాడ్ సూసైడ్ చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నామని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.