Karnataka: తల్లి కళ్లముందే విద్యార్థిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేసిన టీచర్.. గాయాలతో విద్యార్థి మృతి
తల్లి చూస్తుండగానే ఒక విద్యార్థిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేశాడు టీచర్. ఈ ఘటనలో గాయాలపాలై విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లి కూడా గాయాలతో చికిత్స పొందుతోంది.
- Narender Thiru
- Published On : December 19, 2022 / 08:07 PM IST
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తల్లి చూస్తుండగానే ఒక విద్యార్థిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేశాడు టీచర్. ఈ ఘటనలో గాయాలపాలై విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లి కూడా గాయాలతో చికిత్స పొందుతోంది. కర్ణాటక, గడగ్ జిల్లా, హడ్లిన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి ఆరు వేల బస్సులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో గీతా బార్కర్ అనే మహిళ టీచర్‌గా పని చేస్తోంది. ఆమె కొడుకు భరత్ బార్కర్ కూడా అదే స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. అక్కడే ముత్తప్ప అనే వ్యక్తి గెస్ట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. క్లాస్ జరుగుతుండగా ఏదో విషయమై ముత్తప్ప, భరత్ బార్కర్‌పై కోపం తెచ్చుకున్నాడు. గట్టిగా అరుస్తూ భరత్‌ను బాగా కొట్టాడు. ఇనుప రాడ్‌తో అతడిపై దాడి చేశాడు. విషయం గమనించిన భరత్ తల్లి క్లాస్ రూమ్‌కు వచ్చి, తన కొడుకుపై దాడిని ఆపేందుకు ప్రయత్నించింది. అయితే, ఆవేశంలో ఉన్న ముత్తప్ప ఇదేమీ వినిపించుకోలేదు. చివరకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి భరత్‌ను కిందికి తోసేశాడు. ఈ ఘటనలో భరత్‌కు తీవ్ర గాయలయ్యాయి. మరోవైపు ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన అతడి తల్లికి కూడా విపరీతమైన గాయలయ్యాయి.
Telangana: తెలంగాణ అప్పులు రూ.2.67 లక్షల కోట్లు.. వెల్లడించిన కేంద్రం
వెంటనే స్కూల్ సిబ్బంది ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, భరత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అతడి తల్లి గీత సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు ముత్తప్ప పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
