Kashmiri Pandit : శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ ని కాల్చిచంపిన టెర్రరిస్టులు
జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రోను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
- venkaiahnaidu
- Published On : October 5, 2021 / 10:00 PM IST
Srinagar
Kashmiri Pandit జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రోను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
అసలేం జరిగింది
మఖన్ లాల్ బింద్రో(68) ఓ వ్యాపారవేత్త. శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్ వద్ద బింద్రో మెడికేట్ పేరుతో ఓ మందుల దుకాణాన్ని రన్ చేస్తున్నారు. అయితే మంగళవారం ఫార్మసీలో బింద్రో.. మందులను పంపిణీ చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా ఫార్మసీపై కాల్పులకు తెగబడ్డారు. బింద్రోను పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చారు.
తీవ్రగాయాలపాలైన బింద్రోని వెంటనే హాస్పిటల్ కి తరలించినా ఫలితం దక్కలేదు. మార్గం మాధ్యలోనే బింద్రో ప్రాణాలు కోల్పోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా,1990లో కశ్మీర్ లో తీవ్రవాద దాడుల సమయంలో కశ్మీర్ నుంచి వలస వెళ్లని అతికొద్ది మంది కశ్మీరీ పండిట్లలో బింద్రో ఒకరు. ఆయన భార్యతో ఉండిపోయి శ్రీనగర్ లో ఫార్మసీ వ్యాపారాన్ని కొనసాగించారు.
మరోవైపు, శ్రీనగర్ శివారులోని హవల్ ప్రాంతంలోని మదిన్ సాహిబ్ దగ్గర జరిగిన ఉగ్రదాడిలో ఓ వీధివర్తకుడు మరణించాడని,లాల్‌బజార్ ప్రాంతంలో రోడ్డు పక్కన బేల్పూరిని విక్రయించే ఓ స్థానికేతరుడిని కూడా ఉగ్రవాదులు కాల్పి చంపేశారని జమ్ముకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
