శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

  • Publish Date - January 20, 2019 / 12:09 PM IST

హైదరాబాద్ : శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తరచూ బంగారం, డబ్బు పట్టుబడుతూవుంది. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఇండోర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 66 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే బంగారాన్ని షార్జా నుండి తిరువనంతపురం ఫ్లైట్‌లో ఓ స్మగ్లర్‌ తెచ్చి వదిలి వెళ్లాడని.. దాన్ని ఓ ప్రయాణికుడు ఇండోర్‌ నుంచి హైదరాబాద్‌ తీసుకువస్తుండగా అతన్ని అధికారులు పట్టుకున్నారు.