YS Vivekananda Reddy Murder Case : వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్- పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తి

మాజీ మంత్రి వై.యస్.వివేకానంద రెడ్డి హత్యకేసులో ఈరోజు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కడప, అనంతపురం పోలీసులు తనను వేదిస్తున్నారంటు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురము ఎస్పీ ఫక్కీరప్

YS Vivekananda Reddy Murder Case :  మాజీ మంత్రి వై.యస్.వివేకానంద రెడ్డి హత్యకేసులో ఈరోజు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కడప, అనంతపురం పోలీసులు తనను వేదిస్తున్నారంటు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురము ఎస్పీ ఫక్కీరప్ప కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో గంగాధరరెడ్డి ఎస్పీని కలిసి వేధింపుల గురించి వివరించాడు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని.. అలా చెప్తే కోట్ల రూపాయలు ముట్ట చెపుతామని ఆశ చూపి… తనపై ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పాలని కొందరు బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కోన్నాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని బాధితుడు గంగాధర్ రెడ్డిఎస్పీ ని కోరాడు.
Also Read : Spa Workers Gang Rape : మసాజ్ సెంటర్ యువతులపై పోలీసుల సామూహిక అత్యాచారం
ప్రస్తుతం మడకశిర సీఐగా పని చేస్తున్న శ్రీరాములు గతంలో కడప ఎస్పీగా పనిచేశారు. ఆసమయంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. సీఐ శ్రీరాములుతో పాటు వివేకా కుటుంబ సభ్యులు కూడా తనపై ఒత్తిడి తెస్తున్నట్లు గంగాధర రెడ్డి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నాడు. గంగాధర రెడ్డి…వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరుడు.

గత 3ఏళ్లుగా అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి వచ్చి నివసిస్తున్నాడు. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సబ్ జైలులో ఉన్నాడు. బాధితుడు గంగాధర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని ఫక్కీరప్ప తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు