Spa Workers Gang Rape : మసాజ్ సెంటర్ యువతులపై పోలీసుల సామూహిక అత్యాచారం
మసాజ్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులను హోటల్‌కు తీసుకువెళ్లి ఒక పోలీసు, మరో ఇద్దరూ సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

Spa Workers Gang Rape : మసాజ్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులను హోటల్‌కు తీసుకువెళ్లి ఒక పోలీసు, మరో ఇద్దరూ సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
హర్యానాలోని రేవారి జిల్లాలో గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మోడల్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్ర ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలో స్పా సెంటర్‌లో పని చేసే 20 ఏళ్ల యువతులు ఇద్దరు నివసిస్తున్నారు. యువతులిద్దరూ పశ్చిమబెంగాల్‌కు చెందిన వారు.
Also Read : Photos Morphing : ఎమ్మెల్యేతో దిగిన ఫోటో మార్ఫింగ్ చేసి…..డబ్బింగ్ చెప్పి..సోషల్ మీడియాలో…
వారిద్దరినీ బయటకు లాక్కొచ్చి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అక్కడ వారిని లైంగికంగా వేధించారు. అనంతరం వారిద్దరిని స్కార్పియో వాహనం లోకి మార్చి అక్కడ నుంచి ఒక హోటల్ గదికి తీసుకు వెళ్లారు. అక్కడ వారి సహచరుడు ధర్మంద్ర కూడా వారితో కలిశాడు. వారు ముగ్గురూ కలిసి ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిద్దరినీ వదిలేశారు.
వారిలో ఒక యువతి మర్నాడు స్పా సెంటర్ యజమానికి రాత్రి జరిగిన ఘటన వివరించిది. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయటానికి సిధ్దమయ్యాడు. వారిలో రెండో ఆమె పోలీసు ఫిర్యాదు ఇవ్వటానికి భయపడి వెనుకంజ వేసింది. కాస్త ధైర్యం చెప్పాక ఆమె కూడా అంగీకరించింది. స్పా సెంటర్ యజమాని మోడల్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా… హోం గార్డుపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ మహ్మద్ జమాల్ ఖాన్ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.